: వచ్చేనెల 5 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాను: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుకి నిరసనగా వచ్చేనెల 5 నుంచి తాను ఆమరణ నిరాహర దీక్ష చేపడతానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ రోజు ప్రకటించారు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వచ్చి మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని మాట ఇచ్చారని, ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇప్పటివరకు ఆ కళాశాలకు ఎన్‌వోసీ కూడా తెప్పించలేకపోయారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాపై సవతితల్లి ప్రేమ చూపిస్తోన్న కేసీఆర్ మరోవైపు సిద్దిపేట పట్ల మాత్రం ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హయాంలో ఏ అభివృద్ధి చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన అన్నారు.