: తాప్సీ చేసిన వ్యాఖ్యలు విని రాఘవేంద్రరావు నవ్వుకుని.. లైట్ గా తీసుకుని ఉంటారు!: గేయ రచయిత సిరాశ్రీ


హీరోయిన్ తాప్సీ ఇటీవ‌ల ఓ హిందీ షోలో చేసిన వ్యాఖ్య‌లు తెలుగు సినీ అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించిన విష‌యం తెలిసిందే. తాను న‌టించిన మొద‌టి చిత్రం ‘ఝుమ్మంది నాదం’ షూటింగ్ స‌మ‌యంలో త‌న బొడ్డుపై కొబ్బ‌రికాయ‌, పూలు, పండ్లు విస‌ర‌డంతో తాను భ‌య‌ప‌డిపోయాన‌ని, సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్రరావు త‌న బొడ్డుపై మాత్ర‌మే దృష్టిపెట్టాడ‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పట్ల సినీ ప్ర‌ముఖులు కూడా మండిప‌డుతున్నారు. తాప్సీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ త‌న అభిప్రాయాన్ని తెలిపారు.
 
తాప్సీ వ్యాఖ్య‌ల‌తో కొంద‌రు రాఘవేంద్రరావుగారికి అవమానం జరిగిందని, ఇది దక్షిణాది వారిపై ఉత్తరాది వారి చిన్నచూపు అని రకరకాలుగా అభిప్రాయపడ్డారని సిరాశ్రీ త‌న సోష‌ల్ మీడియా పేజీలో పేర్కొన్నారు. రాఘవేంద్రరావుగారి విజ్ఞతకి, అనుభవానికి ఇటువంటి వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌ చాలా లైట్ గా తీసుకుని నవ్వుకునే ఉంటారని అన్నారు. అన్నమయ్య రాసిన శృంగారానికి, జయదేవుని అష్టపదులకి అర్థం తెలుసుకుంటూ మాట్లాడుకుంటే ఈ వీడియోలో కనిపించిన నవ్వులకంటే ఎక్కువే కనపడతాయని ఆయన అన్నారు. అయినా ఆయా సాహిత్యాల విలువ ఏ మాత్రం తగ్గదని పేర్కొన్నారు.

రాఘవేంద్రరావుకి సినిమాల్లో పాటల చిత్రీకరణ పరంగా ఒక ఆర్టిస్టిక్ ఇమేజ్ ఎప్పుడో వచ్చేసిందని సిరాశ్రీ చెప్పారు. ఎంతమంది ఎన్ని రకాలుగా కామెడీలు చేసినా ఆయన ఇమేజ్ కి ఏ మాత్రం బీటలు పడవని అన్నారు. కనుక మనం కంగారు పడి, తాప్సీని కంగారు పెట్టక్కర్లేదని అన్నారు. ‘ఝుమ్మంది నాదం’ సినిమా విడుదల సమయంలో ఒకలా మాట్లాడిన తాప్సీ ఇప్పుడు మరోలా మాట్లాతోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News