: హెడ్ కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్... తుది నిర్ణయం తీసుకోలేదన్న బీసీసీఐ!
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని నియమించినట్టు మీడియాలో ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని, రవిశాస్త్రిని నియమించారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికపై త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.