: కొత్త ప్లాన్లను ప్రకటించిన రిలయన్స్ జియో!
గత ఏడాది టెలికాం మార్కెట్లో ఎంట్రీతోనే ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో దడ పుట్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం 'ధన్ ధనా ధన్' ఆఫర్‌ను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా, రెండు సరికొత్త ప్లాన్స్‌ను తమ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.
జియో ప్లాన్ల వివరాలు...
- రూ.349 ప్లాన్‌తో- 20 జీబీ 4జీ డేటా (56 రోజుల వ్యవధితో)
- రూ.399 ప్లాన్‌తో- 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, కాల్స్ ఫ్రీ
- అలాగే, ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పటివరకు ఉన్నట్లుగానే రూ.19 నుంచి రూ.9999 వరకు ఉంటాయి
- ఇక రూ.149 ప్లాన్స్ లో ఎలాంటి మార్పులు లేవు