varun tej: పవన్ కి 'తొలిప్రేమ'... బన్నీకి 'ఆర్య'.. వరుణ్ కి 'ఫిదా'!

అభిరుచిగల చిత్రాలను నిర్మించడంలో 'దిల్ రాజు' ముందుంటారు. ఒక వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలను నిర్మిస్తూనే, మరో వైపున యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన నిర్మించిన 'ఫిదా' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిన్న ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. యువ కథానాయకులు ప్రేమకథా చిత్రాలు చేయవలసిన ఆవశ్యకతను గురించి చెప్పారు. పవన్ కల్యాణ్ కి 'తొలిప్రేమ' .. బన్నీకి 'ఆర్య' వంటి ప్రేమకథలు పడ్డాయనీ, అవి వాళ్ల కెరియర్ కి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. వరుణ్ చేసిన 'ఫిదా' సినిమా ఆ తరహాలోనిదేననీ, ఈ సినిమా ఆయన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.       
varun tej
saipallavi

More Telugu News