nara rohith: సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న నారా రోహిత్!

నారా రోహిత్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా పూర్తవుతుందనగానే ..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టడం నారా రోహిత్ ప్రత్యేకత. 'జ్యో అచ్యుతానందా' సినిమా సమయంలో బరువు తగ్గాలని నిర్ణయించుకున్న నారా రోహిత్, అప్పటి నుంచి ఆ దిశగా కసరత్తు చేస్తూ వస్తున్నాడు.

 ప్రస్తుతం ఆయన పవన్ మల్లెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటికే 21 కిలోల బరువు తగ్గిన నారా రోహిత్, ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమా ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని నారా రోహిత్ భావిస్తున్నాడు.         
nara rohith

More Telugu News