mahesh babu: విదేశాల్లో 'స్పైడర్' గ్రాఫిక్స్ పనులు!

మహేశ్ బాబు, మురగదాస్ కలయికలో వస్తున్న 'స్పైడర్' సినిమాకి సంబంధించిన ఒక పాట మాత్రమే పెండింగ్ వుంది. వచ్చేనెల మొదటివారంలో ఆ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. కథ ప్రకారం ఈ సినిమాకి భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ అవసరమవుతోంది. అందువలన అందుకు సంబంధించిన పనులను విదేశాల్లో చేయిస్తున్నారు.

 ఇండియాతో పాటు రష్యా .. యూకేలలోను VFX పనులు జోరుగా కొనసాగుతున్నాయట. ఇక 'మగధీర' సినిమాకి పనిచేసిన ఇరాన్ టీమ్ వారు కూడా 'స్పైడర్' కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ గ్రాఫిక్స్ స్టాండర్డ్ కి ఎంత మాత్రం తగ్గవద్దని దర్శక నిర్మాతలు చెప్పారట. దాంతో ఆ స్థాయిలోనే వర్క్ జరుగుతోందని అంటున్నారు. టీజర్ తో సందడి చేసిన ఈ సినిమా, విడుదల తరువాత సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.   
mahesh babu
rakul

More Telugu News