: ఇక ప్రభంజనమే.. టీడీపీ కౌంట్ డౌన్ స్టార్ట్!: వైసీపీ నేత ఉదయభాను
వైసీపీ ప్లీనరీలో జగన్ చేసిన తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఏపీ ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. వైసీపీ ప్లీనరీ విజయవంతం కావడం టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోందని... అందుకే ఆ పార్టీ నేతలు, మంత్రులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జగన్ ను చూస్తేనే టీడీపీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. అక్టోబర్ 27 నుంచి జగన్ చేపట్టనున్న పాదయాత్రలో టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని ఎండగడతామని అన్నారు. జగన్ మహా పాదయాత్రతో టీడీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని చెప్పారు.