: ఢిల్లీకి అనంత్‌నాగ్ క్షతగాత్రులు.. అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందన్న ప్రభుత్వం.. 2000 తర్వాత ఇదే అతిపెద్ద దాడి!
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. క్షతగాత్రులను తొలుత శ్రీనగర్‌కు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఉదయం బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదుల దాడిలో గుజరాత్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు మహిళలే. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2000 సంవత్సరం తర్వాత అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ తెలిపారు. జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందని డివిజనల్ కమిషనర్ మన్‌దీప్ భండారి తెలిపారు. యాత్రకు ఎటువంటి అంతరాయం లేదని, రేపటి నుంచి యథావిధిగా ప్రారంభం అవుతుందని ఆయన వివరించారు.