: షార్క్‌ తోక పట్టుకుని లాగాడు.. చేతిని గాయపరచుకున్నాడు!


ఉత్త‌ర‌ కరోలినాలోని వ్రైట్స్‌విల్లే బీచ్‌లో ఓ వ్య‌క్తి దుస్సాహసం చేశాడు. తీరానికి వ‌చ్చిన ఓ చిన్న టైగర్‌ షార్క్‌ చేప తోక భాగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అత‌డి ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. అతడి చేతిని షార్క్‌ కొరికేసింది. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు బాధితుడు నడుము లోతు ఉన్న నీటిలోకి దిగాడ‌ని, అంత‌లో అక్క‌డ‌కు వ‌చ్చిన‌ షార్క్‌ తోక పట్టుకున్నాడని సంబంధిత అధికారులు చెప్పారు. షార్క్ త‌న చేతిని కొరికేయ‌డంతో చేతి నుంచి కారిపోతున్న రక్తంతో అత‌డు ఒడ్డుకు పరుగులు తీశాడు. బాధితుడి ప‌రిస్థితి ఎలాగుంద‌నే విష‌యం గురించి తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. 

  • Loading...

More Telugu News