: నాకు నాగచైతన్యతో ఇప్పటికే పెళ్లి జరిగిపోయినట్టు భావిస్తున్నా: చెన్నై బ్యూటీ సమంత
తనకు నాగచైతన్యతో ఇప్పటికే పెళ్లి జరిగిపోయినట్టు భావిస్తున్నానని చెన్నై బ్యూటీ సమంత అంటోంది. ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ అమ్మడికి తన అభిమాని నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి సమంత? అని ఓ అభిమాని అడిగింది. దీనికి సమంత జవాబిస్తూ అలా పేర్కొంది. తనకు చైతూతో ఇప్పటికే పెళ్లై పోయినట్లు భావిస్తున్నాను కాబట్టి, తనకు, తన చైతూకి కంటే కూడా ఎక్కువగా తమ అభిమానులకే తమ పెళ్లిపై కుతూహలంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం నాగచైతన్య, సమంత పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.