: జగన్ ప్రజాసేవ చేస్తానని చెప్పుకోవడం లేదు.. సీఎం అవుతానని చెప్పుకుంటున్నారు: జలీల్ ఖాన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాలేడని, 'ఖల్ నాయక్' (ప్రతి నాయకుడు) మాత్రం అవుతాడని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక జగన్ లో ఎంతగానో ఉందని అన్నారు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ తన మనసులోని మాటను బయటపెట్టారని జలీల్ ఖాన్ అన్నారు. మంచి నాయకుడు ఎవరయినా సరే ప్రజాసేవ చేస్తానని అంటారని, కానీ జగన్ మాత్రం సీఎం అవుతానని మాత్రమే చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ చనిపోయిన తరువాత భౌతిక కాయాన్ని బయటకు తీసుకురాకముందే జగన్ సంతకాలు చేయించుకున్నారని, సీఎం కావాలన్న కోరిక జగన్‌కి అంతగా ఉందని జలీల్ ఖాన్ అన్నారు.