: ట్విట్టర్ లో సమంత ఫాలోవర్స్ నలభై లక్షలు!


దక్షిణాది ముద్దుగుమ్మ సమంత ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరింది. దీంతో, ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘మీరు లేకుండా నేను ఏం చేయగలను? మీరే, నాకు గొప్ప స్ఫూర్తి. నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని తన ట్వీట్ లో సమంత పేర్కొంది. కాగా, ఈ సందర్భంగా సమంతకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పెద్ద అభిమానిని’ , ‘ఫాలోయర్స్ ను సంపాదించుకుంటూ మరింతగా ఎదుగుతున్న సామ్!!!’,‘కంగ్రాట్స్’ అంటూ నెటిజన్లు తమ సంతోషం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News