: గాంధీ వేషధారణతో తహసీల్దార్ ఆఫీస్‌కి వచ్చి... ఓ వ్యక్తి హల్‌చల్!
తనకు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శంకర్ అనే ఓ వ్యక్తి తరుచూ వివిధ వేషధారణలతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి హల్‌చల్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన మరోసారి ఆ కార్యాలయానికి వచ్చాడు. ఈ సారి ఆయన మహాత్మా గాంధీ వేషాధరణతో వచ్చి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేగాక, ఓ గదిలోకి దూరి లోపలినుంచి తలుపులు వేసుకుని, ఎంతకీ తీయలేదు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులను పగులకొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నాడు. ఆయన తరుచూ ఇలాగే ప్రవర్తిస్తున్నాడని అక్కడి సిబ్బంది తెలిపారు.