: చిరంజీవి `ఉయ్యాలవాడ`లో ఐశ్వర్య, సోనాక్షి?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` సినిమాలో ఐశ్వర్య రాయ్, సోనాక్షి సిన్హాలు నటించనున్నట్లు చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. బాహుబలితో దేశవ్యాప్త స్థాయికి తెలుగు సినిమా ఖ్యాతి చేరడంతో ఉయ్యాలవాడ చిత్రానికి కొంత బాలీవుడ్ టచ్ ఇచ్చి ఉత్తరాదిలో కూడా వసూళ్లు రాబట్టడానికి నిర్మాత రాంచరణ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించడానికి ముందు ప్రియాంక చోప్రా, విద్యాబాలన్‌లను కూడా రాంచరణ్ సంప్రదించారట. కానీ చివరికి ఐశ్వర్య, సోనాక్షిలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ముట్టజెప్పనున్నారు.