: జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'గుండమ్మ కథ'ను తప్పకుండా చేస్తాను: నాగచైతన్య


జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'గుండమ్మ కథ' సినిమాలో తప్పకుండా నటిస్తానని అక్కినేని నాగచైతన్య తెలిపాడు. 'గుండమ్మ కథ' సినిమాను నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి రీమేక్ చేయనున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రాజెక్టు అటకెక్కినట్టేనా? ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా? లేదా? అంటూ అడిగిన పలు ప్రశ్నలకు నాగచైతన్య సమాధానం చెప్పాడు.

'గుండమ్మ కథ' సినిమా దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు కలిసి నటించిన అద్భుతమైన సినిమా అని అన్నాడు. అలాంటి సినిమాను రీమేక్ చేయడమంటే మాటలు కాదని చెప్పాడు. ఆ సినిమాలో నటించాలని తనకు కూడా ఉందని చెప్పాడు. అయితే ఆ సినిమాను తొందరపడి ప్రారంభించమని, అన్నీ బేరీజు వేసుకుని సినిమా తీస్తామని చెప్పాడు. 

  • Loading...

More Telugu News