: ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం


ఈ ఉదయం ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా ఉంది. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. లేటే ప్రావిన్స్ లోని బురౌఎన్ కు దక్షిణాన 13.3 కిలోమీటర్ల దూరంలో... భూమికి 12 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియొలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.

  • Loading...

More Telugu News