: గోవాలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన నటి టబూ!
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సైతం దుమ్ము రేపిన హీరోయిన్ టబూ గోవాలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. గోవాలోని పోవోరిమ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంటులో ఇంటిని కొనుక్కుంది. ఈ ఇంట్లో ఖరీదైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. అక్టోబర్ చివరి నాటికి ఈ ఇంటి నిర్మాణం పూర్తవుతుందట. టబూకు తెలిసిన ఓ వ్యక్తి అతని పాత బంగ్లాను కూల్చివేసి... ఆ స్థలంలో ఐదంస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు.
ఎంతో అందంగా నిర్మితమవుతున్న ఆ భవనాన్ని చూసి ముచ్చటపడిన టబూ... అక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా టబూ మాట్లాడుతూ, తనకు వీలు దొరికినప్పుడల్లా తన తల్లి, సోదరి కుటుంబసభ్యులతో ఇక్కడకు వచ్చి, ఆనందంగా గడుపుతానని తెలిపింది. గృహప్రవేశం సందర్భంగా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్టు చెప్పింది. మరోవైపు, బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు ఇప్పటికే గోవాలో ఇళ్లను కొనుగోలు చేశారు.