: పాక్ ఆర్మీ పోస్టును పేల్చి వేసిన భారత సైన్యం.. సరిహద్దుల్లో ఉద్రిక్తత!

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నిన్న పాకిస్థాన్ కు చెందిన ఓ బంకర్ ను భారత భద్రతాబలగాలు పేల్చి వేశాయి. ఈ సందర్భంగా పాక్ కు చెందిన ఇద్దరు సైనికులు మరణించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఉన్న భారత గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. దీంతో, పలువురు భారత పౌరులు గాయపడ్డారు. ఈ క్రమంలో, పాక్ బంకర్ ను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More Telugu News