: చైనా మీడియా వింతండ వాదం.. పాకిస్థాన్ కోరితే మూడో దేశం వచ్చి భారత్ ను అడ్డుకోవచ్చు!


డోక్లాం విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా భారత్ పట్టించుకోవడం లేదు. దీంతో బెదిరింపులకు దిగిన చైనా మీడియా కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు చైనాలో ప్రభుత్వ విధానాలకు నిర్దేశం చేస్తుందనే పేరున్న గ్లోబల్‌ టైమ్స్‌ పతిక్రలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ లాంగ్‌ జింగ్‌ చున్‌ అనే కాలమిస్టు సరికొత్త వాదనతో కాలమ్ రాశాడు. అందులో ‘‘సిక్కిం సెక్టార్‌ లోని డోక్లాం ప్రాంతంలో చైనా మిలటరీ రోడ్డు నిర్మించకుండా భూటాన్‌ తరపున భారత్‌ వచ్చి అడ్డుకుంది. భారత్‌ చెబుతున్న దాని ప్రకారం భూటాన్ కోరింది కనుక చైనాను భారత్ అడ్డుకుంటోంది. అంటే పాకిస్థాన్‌ అభ్యర్థిస్తే ‘మూడో దేశం కశ్మీర్‌లో ప్రవేశించవచ్చు’’ అంటూ కొత్త వాదనను ప్రచురించింది.

  • Loading...

More Telugu News