: ఢిల్లీలో కొనసాగుతున్న అత్యాచారాల పర్వం.. ఇద్దరు మైనర్లు, మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం!
అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన మరో మూడు ఘటనలు మహిళల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు మహిళలపై అత్యాచారం జరగ్గా వీరిలో ఇద్దరు మైనర్లు కాగా, మరొకరు మతిస్థిమితం లేని మహిళ.
ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో ఉండే 36 ఏళ్ల వ్యక్తి 8 ఏళ్ల బాలికపై తన కుమార్తె ఎదురుగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఘటన కన్నాట్‌ప్లేస్‌లో జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడో ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది. 38 ఏళ్ల మతిస్థిమితం లేని మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.