: ఆ నటి నాకు చెల్లెలితో సమానం: మాజీ క్రికెటర్ శ్రీశాంత్
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా రూపొందుతున్న తొలి చిత్రం టీమ్ 5. త్రిభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీశాంత్ సరసన నటి నిక్కీ గల్రాని నాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ, తనకు ఇది తొలి చిత్రమని, నిక్కీ గల్రాని ఇప్పటికే 25 చిత్రాలకు పైగా నటించారని, ఆమె తనకు చెల్లెలితో సమానమని అన్నాడు. తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనని చెప్పిన ఆయన, త్వరలోనే భారత క్రికెట్ జట్టుతో కలిసి ఆడనున్నట్టు చెప్పాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ ను చూసి తాను పెరిగిన వాడినని శ్రీశాంత్ చెప్పాడు. విజయ్, అజిత్ లతో కలిసి నటించే అవకాశం వస్తే కనుక, అది చిన్న సన్నివేశమైనా సరే నటించేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా శ్రీశాంత్ చెప్పాడు.