: 'కన్న తండ్రి, తోడబుట్టిన అన్నే నన్నిలా వేధిస్తున్నారు'... అంటూ తప్పుడు కేసు పెట్టిన విద్యార్థిని... చీవాట్లు పెట్టిన కోర్టు
కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు తనపై లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ, తొమ్మిదో తరగతి బాలిక పెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, అది తప్పుడు కేసని తేల్చిన కోర్టు, కేసును కొట్టివేసింది. పుదుచ్చేరిలోని రెడ్డియర్ పాళ్యం పోలీసు స్టేషన్ లో గత సంవత్సరం ఈ కేసు నమోదు కాగా, బాలిక ఫిర్యాదుపై ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తండ్రి పెంపకం కఠినంగా ఉండటంతో, ఇంట్లో ఉండటం ఇష్టం లేకనే సదరు బాలిక ఈ తప్పుడు ఫిర్యాదును ఇచ్చిందని తేల్చింది. కోర్టు విచారణ సందర్భంగా సదరు బాలిక తాను హాస్టల్ లో ఉంటానని చెప్పింది. తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన బాలికను మందలిస్తూ కేసును కొట్టేసింది.