: పెళ్లి తరువాత సమంత ఆ ప్రశ్నవేస్తే ఏం జవాబు చెబుతావ్?: అభిమానితో చైతూను అడిగించిన రానా


హీరో రానా ఆధ్వర్యంలో 'నంబర్ వన్ యారీ విత్ రానా' అనే కార్యక్రమం ప్రసారమవుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇద్దరు సెలబ్రిటీలను తీసుకువచ్చి రానా ఇంటర్వ్యూ చేస్తాడు. తాజా ఎపిసోడ్ లో నాగ చైతన్య, సుమంత్ లు పాల్గొనగా, ఓ అభిమానికి ప్రశ్నించే అవకాశం ఇచ్చాడు రానా.

"మీరు హైదరాబాద్‌ లో మంచి బైక్ రేసర్. నేను యూట్యూబ్‌ లో చూశాను. పెళ్లి తర్వాత సమంత నేను ముఖ్యమా? బైక్ రేస్‌ లు ముఖ్యమా? అని అడిగితె ఏం చెబుతారు?" అంటూ ప్రశ్నించాడు. దీనిపై చైతూ, 'ఇదేం ట్విస్టురా?' అనగా, సుమంత్ మాత్రం మంచి ప్రశ్నని అభినందించాడు.

ఆపై రానా, "ఏంటి? ఏం చెబుతావ్? పెళ్లి తరువాత హే... బైకులు, పాడు వద్దు, వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అంటూ, అన్నీ పడేయమంటే ఏం చేస్తావ్?" అని ప్రశ్నించాడు. ఇక తప్పదనుకున్నాడో ఏమో చైతూ సమాధానమిస్తూ, ఇంట్లో ఉంటే "నువ్వే ఇంపార్టెంట్" అని చెబుతాను. బయటికి వెళితే మాత్రం బైకేనని చెప్పాడు. ఈ సమాధానానికి రానా ఒకింత ఆశ్చర్యపోగా, సుమంత్ మాత్రం చైతన్య ఇదే ఆన్సర్ చెబుతాడని ముందే ఊహించానని అనడం గమనార్హం.

  • Loading...

More Telugu News