: వన్డే మ్యాచ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన‌ శ్రీలంక ఓపెన‌ర్లు


శ్రీలంక క్రికెట‌ర్లు డిక్విల్లా, గుణతిలక ఈ రోజు స‌రికొత్త రికార్డు నెల‌కొల్పారు. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఈ రోజు శ్రీలంక నాలుగో వ‌న్డే ఆడుతోంది. మూడో వ‌న్డేలో తొలి వికెట్‌కి 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ ఇరువురు ఓపెన‌ర్లు ఈ రోజు జ‌రిగిన వ‌న్డేలోనూ తొలి వికెట్‌కి 209 పరుగులు సాధించారు. దీంతో మొట్ట‌మొద‌టిసారి వరుసగా రెండు వన్డేల్లో 200 ప‌రుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన క్రికెటర్లుగా వీరు రికార్డు సృష్టించారు. ఈ రోజు కొన‌సాగుతున్న‌ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే త‌డ‌బ‌డుతోంది.    

  • Loading...

More Telugu News