: 30 ఏళ్లకే బోయింగ్ 777 నడిపిన మహిళా పైలట్
పంజాబ్‌లోని పఠాన్ కోట్ ప్రాంతానికి చెందిన యానీ దివ్యకు చిన్న వయసు నుంచే పైలట్ అయ్యి విమానం నడపాలని ఉండేది. ఆ కల నిజం చేసుకోవడానికి ఆమె పడిన కష్టమే ఈరోజు చిన్న వయసులోనే బోయింగ్ 777 విమానాన్ని నడిపే స్థాయికి తీసుకువచ్చింది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని యానీ దివ్య మరోసారి రుజువు చేసింది. తను మొదట్లో ఈ కెరీర్‌ను ఎంచుకున్నపుడు అందరూ 'అవసరమా?' అని అన్నారని, అయినా పట్టుదలతో తాను 19 ఏళ్లకే శిక్షణ పూర్తి చేసుకున్నానని దివ్య తెలిపింది. తనని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆర్థికంగా తన కుటుంబం చాలా కష్టాలు పడిందని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని యానీ దివ్య చెప్పారు.