: ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయ్!
ఈ నెల 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా హాళ్లలో టికెట్ల రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా ముగిసినట్లు సమాచారం. సర్కారు నిర్ణయించిన ధరల ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో గతంలో రూ.75 రూపాయలుగా ఉన్న టికెట్ ధర ఇకపై రూ.100 కానుంది. మల్టీప్లెక్సెస్ (ఆల్ క్లాసెస్)లో గతంలో రూ.150గా ఉన్న ధర ఇకపై రూ.200 కానుంది.. గతంలో రూ.250గా ఉన్న రిక్లైనర్స్ ఇప్పుడు రూ.300 కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.