: సౌరవ్ గంగూలీకి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయిన వాటిల్లో 'హ్యాపీ బర్త్ డే దాదా' హ్యాష్ ట్యాగ్ ముందుంది. 1972 జూలై 8న గంగూలీ జన్మించాడు. భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలు, 77 టీ20లు ఆడాడు. 49 టెస్టులు, 147 వన్డేలకు కెప్టెన్ గా బాధ్యతలను నిర్వర్తించాడు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో సెహ్వాగ్ స్పందిస్తూ... టెస్టుల్లో తాను సాధించిన విజయాలకు నీవిచ్చిన అవకాశాలు, మద్దతే కారణమంటూ పేర్కొన్నాడు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. జాతీయ పతాకాన్ని ఎన్నోసార్లు రెపరెపలాడించావు... లార్డ్స్ లో చొక్కా విప్పి గాల్లో తిప్పావంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఐసీసీ, బీసీసీఐలు కూడా గంగూలీకి శుభాకాంక్షలు తెలిపాయి. గంగూలీ ఎప్పటికీ లెజెండే అంటూ మహ్మద్ కైఫ్ కొనియాడాడు.