: జగన్ నేరాలు, ఘోరాలతో 'నేరాల చక్రవర్తి' పుస్తకం: యనమల
వైసీపీ అధినేత జగన్ పై త్వరలోనే 'నేరాల చక్రవర్తి' పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ పుస్తకంలో జగన్ చేసిన నేరాలు, ఘోరాలు ఉంటాయని చెప్పారు. కోర్టు కేసులు వేస్తూ, దొంగ దీక్షలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారారని విమర్శించారు. పార్టీ పెట్టినప్పుడే జగన్ రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవాల్సిందని... పార్టీ పెట్టి ఇన్నేళ్లు అయిన తర్వాత వ్యూహకర్తలను పెట్టుకుని ఆయన ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. వైసీపీ తీసుకొచ్చిన 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకం అబద్ధాల పుట్ట అని అన్నారు.