: '2.0' చిత్రానికి భారత్ కంటే చైనాలో ఎక్కువ థియేటర్లు
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న `2.0` సినిమాని భారత్‌లో కంటే చైనాలోనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయనున్నారు. అందుకు కారణం ఈ సినిమాను 3డీలో తీయడం. భారత్‌లో 3డీ థియేటర్లు 1500 వరకు ఉంటాయి. మరి చైనాలో వీటి సంఖ్య 15000లకు పై మాటే. అంతేకాకుండా చైనాలో రజనీకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని సినిమా థియేటర్లు 3డీ లోకి మారుతున్నాయి. మరి రజనీ అంటే మాటలా! రికార్డుల రికార్డులు బద్దలవ్వాల్సిందే.