: తిరుమల కొండపై 10 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు!
తిరుమల కొండపై పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి పాదాల సమీపంలో సుమోను టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంటో టెంపో లోయలోకి దూసుకుపోయింది. అయితే అక్కడ ఉన్న ఓ చెట్టు టెంపోను లోయలోకి పడిపోకుండా అడ్డుకుంది. చెట్టును ఢీకొన్న టెంపో అక్కడే ఆగిపోయింది. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బళ్లారికి చెందిన 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.