: అధికారమే లక్ష్యంగా.. సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్!
2019 ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ సలహాలతో జగన్ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ధర్నాలు, సభలతో ప్రయోజనం లేదని... పాదయాత్రల వంటి కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లాలని ప్రశాంత్ సూచించిన నేపథ్యంలో సుదీర్ఘ పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో పాదయాత్ర మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఏకంగా 8 నెలల పాటు ఈ యాత్ర కొనసాగబోతోంది. పాదయాత్రపై ఇప్పటికే పార్టీ కీలక నేతలతో జగన్ చర్చించారు. వైసీపీ ప్లీనరీలో ఈ పాదయాత్ర గురించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.