: మాంచెస్టర్ దాడి కేసులో కొత్త కోణం.. దాడి ఖర్చు కోసం స్టూడెంట్ లోన్ తీసుకున్న ఉగ్రవాది!


మాంచెస్టర్ ఉగ్రదాడి కేసులో బ్రిటన్ పోలీసులు కొత్త కోణాన్ని వెల్లడించారు. మాంచెస్టర్ ఎరీనాలో దాడికి పాల్పడిన ఉగ్రవాది సల్మాన్ అబేదీ బాంబు తయారీ కోసం బ్యాంకు నుంచి విద్యారుణం తీసుకున్నట్టు వెల్లడించారు. దాడి కోసం దాదాపు వెయ్యి పౌండ్లు అవసరమవుతాయని భావించిన అబేదీ ఆ మేరకు రుణం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మాంచెస్టర్ ఎరీనాలో జరిగిన దాడిలో 22 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ దాడి కోసం అబేదీ స్వయంగా బాంబు తయారుచేశాడు. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News