: ధోనీ కోసం 6 రోజులు ట్విట్టర్ కు దూరంగా ఉన్న సంగీత దర్శకుడు...ఎందుకో తెలుసా?


 ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ధోనీ కోసం ట్విట్టర్ కు 6 రోజులు దూరంగా వున్నాడు. తమన్ క్రికెట్ కు వీరాభిమాని, ధోనీకి కూడా మంచి అభిమాని.  కాగా, అప్పటికి సోషల్ మీడియాలో 9999 ట్వీట్లు చేసినట్టు తమన్ గుర్తించాడు. దీంతో 10000 ట్వీట్ తన అభిమాన క్రికెటర్ ధోనీ బర్త్ డే విషెస్ కావాలని భావించి, ఆరు రోజులుగా ట్విట్టర్ కి దూరంగా గడిపాడు. ఈ విషయాన్ని అభిమానులకు చెబుతూ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, ధోనీ స్కెచ్ ఒకటి షేర్ చేశాడు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తమన్ స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు అప్పుడప్పుడు చెన్నై నుంచి హైదరాబాదు వస్తుంటాడని, సరదాగా ఆడి వెళ్తుంటాడని ఫిల్మ్ నగర్ టాక్.

  • Loading...

More Telugu News