: జగన్ 'పార్ట్ టైమ్' రాజకీయనాయకుడు.. 'ఫుల్ టైమ్' అభివృద్ధి నిరోధకుడు: ఏపీ మంత్రులు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ పార్ట్ టైమ్ రాజకీయనాయకుడిగా, ఫుల్ టైమ్ అభివృద్ధి నిరోధకుడిగా మారారని ఏపీ మంత్రులు విమర్శించారు. ఈ మేరకు జగన్ కు 24 ప్రశ్నలు సంధిస్తూ మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, ఆదినారాయణరెడ్డి ఓ లేఖ రాశారు. జగన్ కు ప్రజల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఉంటే కనుక తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ను జగన్ పొరుగు రాష్ట్రంలో కలిశారని ఆ లేఖలో విమర్శించారు.

కాగా, వైఎస్ జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. అధికారం దక్కలేదన్న అక్కసుతోనే అడుగడుగునా జగన్ విషం కక్కుతున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ఏ అంశంలోనూ ప్రతిపక్షం సహకరించడం లేదని, మీలాంటి బాధ్యతలేని ప్రతిపక్షనేత వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని, అధికార పార్టీ నేతలపై బురదజల్లేందుకే అమరావతిలో వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
 

More Telugu News