: సూపర్బ్.. ఎన్టీఆర్ కొత్త సినిమా టీజర్‌కి అద్భుత స్పందన వచ్చింది: కల్యాణ్ రామ్
తమ సినిమాలోని ‘జై’ పాత్రను పరిచయం చేస్తున్నామంటూ నిన్న ‘జై లవకుశ’ చిత్రం బృందం ఓ టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో నెగిటివ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ రావణుడిలా చూపించిన ఆహార్యం ఆయన అభిమానులతో అదుర్స్ అనిపిస్తోంది. యూ ట్యూబ్‌లో ఈ టీజర్ అత్యధిక క్లిక్స్‌తో దూసుకుపోతుండడంతో ఎన్టీఆర్ సైతం స్పందించి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
ఈ సినిమా టీజర్‌పై స్పందించిన నటుడు, నిర్మాత కల్యాణ్ రామ్.. ఓ పోస్టర్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలోని జై పాత్రను పరిచయం చేస్తూ వదిలిన టీజర్‌కు వచ్చిన స్పందన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నాడు. ఇంతగా ఆదరణ కనబరుస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. మున్ముందు ఇలాంటివి తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి మరిన్ని వస్తాయని అన్నాడు.