: ఏపీలో మాదిగలకు ఏం చేయాలో మాకు తెలుసు: వర్ల రామయ్య

రాష్ట్రంలో మాదిగలకు ఏం చేయాలో తమకు తెలుసని ఏపీ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవో 25 అమలు చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వర్గీకరణ కంటే తెలంగాణే ముఖ్యమని నాడు వ్యాఖ్యానించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ.. ఏపీకి వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై ఆరోపణలు రాగానే పార్టీ నుంచి తప్పించిన విషయాన్ని ప్రస్తావించిన వర్ల,
వైసీపీ ప్లీనరీలో జగన్ కేసులపై చర్చిస్తారా? అంటూ ప్రశ్నించారు.  

More Telugu News