: కశ్మీర్లో రసాయన ఆయుధాలు వాడుతోంది: ఇండియన్ ఆర్మీపై పాక్ తీవ్ర ఆరోపణలు!

ఇండియన్ ఆర్మీపై పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. కశ్మీర్ లో భారత సైన్యం రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారని ఆ దేశ పత్రిక ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. ఆయన ఆ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. కశ్మీరీలను హతమార్చి, వారి ఆస్తులు ధ్వంసం చేసేందుకు భారత ఆర్మీ రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని అన్నారు.

పుల్వామా జిల్లాలోని బహమానూ, కక్పోరాల్లోని ఇళ్లలో కశ్మీరీ యువకుల కాలిన మృతదేహాలు లభించాయని ఆయన చెప్పారు. దీనిని బట్టి ఇండియన్ ఆర్మీ రసాయన ఆయుధాలు వినియోగిస్తోందని అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ రసాయన ఆయుధాల ప్రయోగం నిజమే అయితే అది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టేనని, దీనిపై అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. 

More Telugu News