: యార్కర్ తో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ను గాయపరిచిన అర్జున్ టెండూల్కర్!


టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఆకట్టుకుంటున్నాడు. అండర్‌-19 జట్టులో సభ్యుడైన అర్జున్ టెండూల్కర్ జట్టుతోపాటు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ప్రారంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. దీంతో అండర్ 19 జట్టు బౌలర్లను ప్రాక్టీస్ కోసం వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టోకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేశాడు. పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ వేసిన యార్కర్ బెయిర్ స్టోను గాయపరిచింది. దీంతో ప్రాక్టీస్ ముగించిన బెయిర్ స్టో... కుంటుకుంటూ స్టేడియం నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది. అనంతరం పలువురు ఆటగాళ్లకు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బంతులతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని గ్రౌండ్స్ మన్ చెబుతున్నారు. కాగా, బెయిర్ స్టో గాయం చిన్నదని, మొదటి టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఇంగ్లండ్ జట్టు ఫిజియో తెలిపారు. 

  • Loading...

More Telugu News