: ఎయిరిండియాకు షాక్... 200 కోట్ల విలువైన చిత్రపటాలు మాయం?
ఎయిరిండియాకు ఊహించని విధంగా 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఎయిరిండియా హెడ్ క్వార్టర్స్ లో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన చిత్రపటాలు మాయమైనట్టు తెలుస్తోంది. ఇందులో ఎయిరిండియా సేకరించిన అరుదైన చిత్రపటాలు, ప్రముఖ చిత్రకారులు చిత్రీకరించిన చిత్రపటాలు వున్నాయి. సంస్థ ప్రధాన కార్యాలయంలో విలువైన చిత్రపటాలు మాయమవడం పట్ల ఎయిర్‌ఇండియా సీఎండీని వివరణ కోరగా, ఆయన సమాధానం దాటవేయడం గమనార్హం. అయితే దీనిపై దర్యాప్తు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.