: గురితప్పిన రాకెట్లు... ప్రాణాలతో బయటపడ్డ పాకిస్థాన్ మంత్రి


తమకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలని ఆ దేశంలోని బలూచిస్థాన్‌ కి చెందిన కొందరు ప్ర‌జ‌లు సాయుధ పోరు సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఇక్కడ అల్‌ఖైదా కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బ‌లూచిస్థాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి రెహ్మత్‌ సలేహ్‌పై రాకెట్‌ దాడి జరిగింది. అయితే, ఆ రాకెట్లు గురిత‌ప్ప‌డంతో ఆయన తృటిలో త‌ప్పించుకున్నారు. ఈ రోజు ఆయ‌న‌ ప్రోమ్‌ నుంచి పంజ్‌గుర్‌ పట్టణానికి తన కాన్వాయ్‌తో బయలుదేరగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాకెట్ల‌ను ప్ర‌యోగించ‌డ‌మే కాకుండా ఆ ప్రాంతంలో కొంద‌రు కాల్పులు కూడా జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఎవ‌రో ఇంత‌వ‌ర‌కు తెలియ‌రాలేదు. పాక్‌ భద్రతాబలగాలు వెంట‌నే ప్ర‌తి స్పందించ‌డంతో దుండ‌గులు పారిపోయారు.    

  • Loading...

More Telugu News