: మీ అధినేతను కలవాలని మేమేం కోరుకోవడం లేదు: చైనాకు దీటుగా సమాధానమిచ్చిన భారత్
జర్మనీలో జరగనున్న జీ-20 సమాఖ్య సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీతో తమ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం కాబోరని... భేటీకి అవసరమైన అనుకూల వాతావరణం లేదని చైనా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. జిన్ పింగ్ తో భేటీ కావాలని మిమ్మల్ని ఎవరడిగారంటూ కౌంటర్ ఇచ్చింది. చైనా అధినేతను కలవాలనే ఆలోచనే తమకు లేదని... అలాంటప్పుడు, అనుకూల వాతావరణం అనే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ లో మోదీ వెంట ఉన్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరోపక్క, జీ20 సదస్సులో కాకపోయినా, బ్రిక్స్ దేశాల సమావేశాల్లో ఇరువురు నేతలు పాల్గొనే అవకాశం ఉందని భారత అధికారులు అంటున్నారు. గత మూడు వారాలుగా ఇరు దేశాల మధ్య సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.