: పీఓకే మీదుగా చైనా నుంచి పాక్‌కు సరుకుల రవాణా!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా నిర్మించిన చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ ద్వారా పాకిస్థాన్‌కు సరుకుల రవాణా చేయాలని చైనా యోచిస్తోంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా పెద్దమొత్తంలో సరుకును పాకిస్థాన్‌కు తరలించే అవకాశం ఉంది. చైనాలోని గ్వాంగ్జూ రాజధాని లాన్‌జూ ప్రాంతం నుంచి మొదలై పాకిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవు వరకు సరుకు రవాణా కొనసాగుతుంది. కానీ ఎప్పట్నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
గతేడాది మేలో లాన్‌జూ నుంచి ఖాట్మండ్ వరకు రవాణా సౌకర్యాలు కల్పించిన ఈ కారిడార్ ద్వారా పెద్దమొత్తంలో వ్యాపారం జరిగింది. మిగతా దక్షిణాసియా దేశాలకు కూడా సరుకు రవాణా సేవలు విస్తరించే యోచనలో చైనా ఉంది. సరుకు రవాణా సాకుతో ఏదైనా విద్రోహ చర్యలకు పాకిస్థాన్, చైనాలు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఈ చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ నిర్మాణాన్ని భారత్ మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది.