: కాంగ్రెస్ నేతలు ఎవరూ వైయస్ జయంతి కార్యక్రమాలలో లో పాల్గొనద్దు.. దోచుకున్నందుకే జగన్ జైలుకెళ్లాడు: వీహెచ్
సోనియాగాంధీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. వెంటనే భూమన క్షమాపణ చెప్పాలని... లేనిపక్షంలో వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. జగన్ ను సోనియాగాంధీనే సీబీఐ కేసుల్లో ఇరికించారని అనడం తప్పని అన్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నందుకే జగన్ జైలుకు వెళ్లాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఫొటోలు దిగారనే కారణంతో దళిత ఎమ్మెల్యేలను తిట్టిన జగన్... క్రిస్టియన్లు, ముస్లింలను దూషించిన రామ్ నాథ్ కోవింద్ కాళ్లకు ఎందుకు మొక్కారని ప్రశ్నించారు.