: రమ్యకృష్ణ నక్షత్రం కాదు, ఆకాశం!: దర్శకుడు కృష్ణవంశీ

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘నక్షత్రం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఉదయభాను అడిగిన ఓ ప్రశ్నకు కృష్ణవంశీ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘మీ నిజజీవితంలో ‘నక్షత్రం’ ఎవరు?’ అనే ప్రశ్నకు..‘నా లైఫ్ లో నక్షత్రం నా కొడుకు’ అని ఆయన సమాధానమిచ్చారు.

అయితే, కృష్ణవంశీ భార్య, ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ గురించి వేదికపై ఉన్న కొందరు ప్రస్తావించారు. ఇందుకు కృష్ణవంశీ స్పందిస్తూ..‘రమ్యకృష్ణ నక్షత్రం కాదు, ఆకాశం’ అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకోవడంతో చప్పట్లు మారుమోగిపోయాయి. కాగా, కృష్ణవంశీ గతంలో తెరకెక్కించిన సినిమా చంద్రలేఖ. ఈ సినిమా షూటింగ్ లో రమ్యకృష్ణతో ఆయనకు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. 2003 జూన్ 12న కృష్ణవంశీ, రమ్యకృష్ణ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

More Telugu News