: జగన్ కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన.. ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యేలు!
ఏపీలోని 13 జిల్లాలలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే సభలు, దీక్షలు మాత్రమే సరిపోవని... ప్రజలను నేరుగా కలుసుకోవాలని జగన్ కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు సమాచారం. దీనికి పాదయాత్రే సరైన మార్గమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైయస్ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టిన తర్వాతే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు రానున్న ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందని జగన్ కు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారట. ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వరాదని... గెలుపు గుర్రాలను గుర్తించాలని చెప్పారట. ఈ నేపథ్యంలో, పలువురు వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు. టికెట్ దక్కని జాబితాలో తమ పేరు కూడా ఉందేమో అని టెన్షన్ కు గురవుతున్నారు.