: క్రికెటర్ ఉమేశ్ యాదవ్ చేతుల్లో ఎంత పెద్ద పీతలో!


వెస్టిండీస్ తో వన్డే సిరీస్ నిమిత్తం టీమిండియా జట్టు ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన అభిమానులతో పంచుకున్న ఓ ఫొటో ఆసక్తికరంగా ఉంది. కరేబియన్ దీవుల్లో దొరికే పెద్ద సైజ్ పీతలను తన రెండు చేతుల్లో పట్టుకుని నవ్వుతూ ఫొటోకు పోజిచ్చాడు. ఆ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఉమేశ్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు తమ దైన శైలిలో ప్రశంసలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, కింగ్ స్టన్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది.

  • Loading...

More Telugu News