: భారత్‌తో ముదిరిన వివాదం.. తమ పౌరులకు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌నున్న చైనా


భార‌త్‌, భూటాన్‌, చైనా సరిహ‌ద్దులో నిర్మిస్తోన్న రోడ్డు నిర్మాణం ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తమ‌వుతున్న‌ప్ప‌టికీ, చైనా త‌న ప‌ని కానిచ్చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో భార‌త్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా తన పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేయనుంది. భారత్‌లో పర్యటించే త‌మ దేశీయులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేయాల‌ని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉండే త‌మ దేశీయుల భద్రత, వారి హక్కుల రక్షణకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ హువాంగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News