: పొన్నం ప్రభాకర్ ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు!
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముందే ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ ఫొటో లేదంటూ ఓ వర్గం వారు మరో వర్గం వారిని నిలదీశారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నంత పని చేశారు. అయితే, అక్కడే ఉన్న పొన్నం స్పందిస్తూ, మనలో మనం కొట్టుకోవడం కాదని, అవతలి పార్టీ వారిపై పోరాడాలంటూ వారికి చురకలు వేశారు. పని చేసిన వారిని పార్టీ ఎన్నడూ మరవదని, వారిని గుర్తిస్తుందని ఘర్షణ పడ్డ వర్గాలకు నచ్చజెప్పారు.