: మరో వివాదాస్పద కథను ఎంచుకున్న దండుపాళ్యం దర్శకుడు!
నిజజీవిత సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శ్రీనివాసరాజు మరో వివాదాస్పద కథతో మన ముందుకు రానున్నాడు. 2004లో కంచిపీఠంలో జరిగిన హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని తీయనున్నారు. `ఆచార్య అరెస్ట్` టైటిల్‌తో, `యాన్ ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందూ` అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నిర్మించనున్నారు. మఠంలో హత్యకు గురైన శంకరరామన్, ఆ కారణంగా అరెస్టైన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చుట్టూ ఈ కథ తిరుగుతుందని, సంఘటనకు సంబంధించిన లోతైన వివరాల కోసం తాను రెండేళ్ల పాటు పరిశోధించినట్లు శ్రీనివాసరాజు తెలిపారు. `దండుపాళ్యం 3` షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.